Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

తన్మయత్వం - Written by Kumaraswamy.

చాలా కాలం కిందట, వ్యాపార నిమిత్తం తన విదేశ పర్యటన చేసుకున్న ఒక వ్యాపారి రాసిన కథ ఇది. ఆ వ్యాపారి తన పని నిమిత్తం ఒక దేశానికీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడి బాషా తెలియదు, వేషధారణ, ఆహరం అలవాట్లు ఏమి తెలియకున్నాను తెలిసిన మిత్రుడు ఉన్నందున అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. 

ప్రయాణం బాగా సాగింది.తన మిత్రుడు కుశల ప్రశ్నల అనంతరం ఈ వ్యాపారికి ఒక హోటల్లో బస ఏర్పాటు చేయడం జరిగింది. నేను  రేపు పొద్దున వస్తాను ఈ రోజు విశ్రాంతి తీసుకో అని మిత్రుడు చెప్పి వెళ్ళాడు. కొత్త ప్రదేశం వ్యాపారికి ఎంతో నచ్చింది మిత్రుడి మాటలని బట్టి వచ్చిన పని ఎంతో లాభదాయకం అని అనుకున్నాడు. 

ఆలోచనల్లో మునిగిన అతనికి ఏదో ఒక పాట వినపడింది. అర్ధం కానీ బాష , కానీ ఎంతో శ్రవ్యమైన సంగీతం, తియ్యని గొంతుక కలిగిన ఆ పాట అతన్ని మంత్ర ముగ్ధుణ్ణి చేసింది. ఆ పాట వింటూ స్నానం చేసే అతను.. ఆలా ఆ పాట వినబడే వైపుకు వెళ్ళిపోయాడు.. చివరికి పాట వచ్చేది హోటల్ బయట ఉన్న చిన్న కొట్టులో ఉన్న రేడియో నుండి ...  అక్కడే ఆ పాట అయిపోయేంత వరకు నిలబడ్డాడు. 

 

కళ్ళు మూసుకుని పరధ్యానంలో.. కాసేపటికి కళ్ళు తెరిచి చుస్తే!.. అతను వొంటిపై బట్టలు లేకుండా వచ్చి ఆ కొట్టు ముందు నిలబడి ఉన్నాడు.. ఇదేమి వైపరీత్యం! నేను బట్టలు లేకుండా ఇలా ! అని తేరుకునేంతలోనే.. అందరూ అతన్ని చూసి నవ్వసాగారు! ఆ హఠాత్ పరిణామానికి ఏమి చేయాలో తోచక పక్కనే ఉన్న చిన్న చెట్ల పొదల్లోకి వెళ్లి తన ఒళ్ళు కనబడకుండా కాపాడుకున్నాడు. " దేవుడా! నువ్వే కాపాడాలి! అనే మాట అతని నోటి నుండి అనుకోకుండా వచ్చేసింది.

ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో ఒక భిక్షగాడు! కొన్ని గుడ్డ పీలికలు చేతిలో పట్టుకుని  
భిక్షగాడు : ఇచ్చి, హ్మ్మ్ ! ఇవి తీసుకో! అని ఇతని పైకి విసిరేసాడు.
బిక్షగాన్ని చూసి వ్యాపారి " ఏయ్ పో ! దూరంగా పో ..అసలె పరువు పోయి నెను ఉంటె! అన్నాడు.
నువ్వే కదా రమ్మన్నావు అని బిక్షాగాడు అనేసరికి వ్యాపారి ఆశ్చర్యపోయాడు
అవును... కాపాడు అని వేడుకొన్నది నువ్వేగా !  
నీకు ఇప్పుడు వస్త్రాలు కావాలి !  అవే ఇచ్చాను.. అని వెళ్ళిపోయాడు..


ఏమి జరిగిందో అర్ధం కావడానికి  వ్యాపారికి ఎక్కువసేపు పట్టలేదు!

Yorum Gönder

0 Yorumlar